ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇక డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదా, పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు.
#WATCH | BJP leader Mohan Charan Majhi takes oath as the Chief Minister of Odisha, in Bhubaneswar. Governor Raghubar Das administers him the oath to office. pic.twitter.com/Xuv1MRsHcq
— ANI (@ANI) June 12, 2024
భువనేశ్వర్‌లోని జనతా మైదాన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 147 స్థానాలకు గాను 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 2000, 2004లో బీజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ రాష్ట్రాన్ని పాలించింది