ఒక్కో సీటుపై వంద కోట్లు పెట్టే చాన్స్..వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ప్లాన్​

ఒక్కో సీటుపై వంద కోట్లు పెట్టే చాన్స్..వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ప్లాన్​
  • జమ్మూ కాశ్మీర్​ మాజీ డిఫ్యూటీ సీఎం డాక్టర్​ నిర్మల్​ సింగ్​

భద్రాద్రి కొత్తగూడెం , వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్కో ఎమ్మెల్యే సీటుకి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ లీడర్, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ కుమార్ సింగ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గురువారం రాత్రి బీజేపీ సీనియర్ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రజాధనాన్ని దోచుకుంటోందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఖర్చు చేసేందుకు డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. సింగరేణిని సైతం దోచుకుంటుందని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నాయకులు యడ్లపల్లి శ్రీనివాసరావు, లక్ష్మణ్ అగర్వాల్, ఆకుల నాగేశ్వరరావు గౌడ్, కోనేరు నాగేశ్వరరావు, టి నరేంద్రబాబు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు చేయట్లే

ఖమ్మం కార్పొరేషన్​: తెలంగాణలో కుటుంబపాలన నడుస్తోందని నిర్మల్​సింగ్​ అన్నారు. మహాజన సంపర్క్​అభియాన్​లో భాగంగా ఖమ్మం వచ్చిన ఆయన మాట్లాడారు. కేసీఆర్​ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా..నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఆయుష్మాన్​ భారత్ ​లాంటి అనేక పథకాలను ఇక్కడ ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 60శాతం మంది ఎస్టీ, ఎస్సీలు మంత్రులుగా ఉన్నారని, బీఆర్ఎస్ ​ప్రభుత్వంలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీలు మంత్రులుగా ఉన్నారో చెప్పాల న్నారు. రాష్ర్టంతో పాటు ఖమ్మం జిల్లాలో నేషనల్​హైవేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ర్ట సహ ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​రెడ్డి, కడగంచి రమేశ్​, వెంకటరమణ, తక్కెళ్ళపల్లి నరేందర్​రావు, రుద్ర ప్రదీప్, ఉప్పల శారద, మందా సరస్వతి, చావా కిరణ్, గెంటేల విద్యాసాగర్​, సుదర్శన్​, శ్రీదేవి పాల్గొన్నారు.