సలహాదారులతో రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేంది? : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

సలహాదారులతో రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేంది? : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు : సలహాదారుల నియామకంతో రాష్ట్రానికి కొత్తగా ఒరిగే దేందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే సీఎం కేసీఆర్ వారిని నియ మిస్తున్నారని ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఖజానాను దోచేం దుకు, తప్పుడు సలహాలు ఇచ్చేందుకే మాజీ సీఎస్ సోమేశ్ కుమార్​ను సలహాదారుగా నియమించారని ప్రభాకర్ విమర్శించారు.

గతంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేం దుకే పదవీ విరమణ పొందిన ఉన్నతాధికా రులను ప్రభుత్వం మళ్లీ నియమించు కుంటోందని మండిపడ్డారు. సలహాదా రుల నియామకం కూడా రాజకీయ నియామకాలు అయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్ లతో ఒరిగిందేమీ లేదని, వాటిని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలగిస్తుందని చెప్పారు.