మేయర్ అనుచరులు కొట్టారని బీజేపీ నాయకురాలి ఆత్మహత్యాయత్నం

మేయర్ అనుచరులు కొట్టారని బీజేపీ నాయకురాలి ఆత్మహత్యాయత్నం

జూబ్లీహిల్స్, వెలుగు: కాలనీ సమస్యలపై నిలదీశారనే కక్షతో మేయర్ మనుషులు తనను కొట్టారని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు పావని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మేయర్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్ బస్తీకి చెందిన 751 మంది యజమానులు ఓ వాట్సప్ గ్రూప్ పెట్టుకున్నారు. 4 రోజుల క్రితం లోకల్ బీజేపీ నాయకురాలు పావని తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మేయర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బస్తీని ఇలాగే వదిలేస్తే బంగ్లాదేశ్ గా మారుతుందని పోస్టు పెట్టారు. దీంతో గురువారం మేయర్​అనుచరులు కొందరు పావని  నివాసానికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఆమెపై దాడి చేశారు. మనస్తాపం చెందిన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.