రాష్ట్రంలో ధృతరాష్ట్రపాలన: రఘునందన్ రావు

రాష్ట్రంలో ధృతరాష్ట్రపాలన: రఘునందన్ రావు

గజ్వెల్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుతెలిపారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాటజరిగింది. రఘునందన్ రావు మాట్లాడుతూ… శుక్రవారం ఆర్టసీ మహిళా కార్మికులపై జరిగిన దాడికి సీఎం కేసీఆర్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. కేసీఆర్ కళ్లున్న కబోదని… నాటి దృతరాష్ట్రుడి పాలనలో ద్రౌపతికి జరిగిన అన్యాయం నేడు తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఆర్టీసీ మహిళా కార్మికులకు జరిగిందని అన్నారు. మహిళా హక్కులను కాలరాసి, దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఉద్యోగసంఘాల నాయకుడిగా చేశారని అయితే.. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా ఉద్యోగసంఘాలను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లారని అన్నారు రఘునందన్ రావు.  ఉద్యోగసంఘాలలో చీలికతేవడానికి శ్రీనివాస్ గౌడ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంత్రి పదవి కాపాడుకోవడానికి కార్మికుల భవిష్యత్తును నాశనం చేయకూడదని శ్రీనివాస్ గౌడ్ కు హితవు పలికారు రఘునందన్ రావు. ఉద్యోగసంఘాలు, కార్మికులు ఐక్యంగా ఉండాని… కార్మికులకు అండగా బీజేపీ ఉందని చెప్పారు.