
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో బీజేపీ నేతను కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. సంభాల్ కు చెందిన స్థానిక బీజేపీ నేత అనూజ్ చౌదరిని గురువారం పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ను గురువారం (ఆగస్టు 10) పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. బీజేపీ నేత అనూజ్ చౌదరి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడని.. గురువారం సాయంత్రం మొరాదాబాద్‌లోని ఆయన ఇంటి బయట ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థి కోణమే హత్యకు కారణమని.. ఉద్దేశ్య పూర్వకంగానే బీజేపీ నేతపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అనూజ్ చౌదరి నేలపై పడిన తర్వాత కూడా షూటర్లు ఆయనపై కాల్పులు జరుపుతున్నట్లు సీసీటీవీ వీడియోలో రికార్డయింది.