సీఎం నుండి ఫోన్ వచ్చిందని బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు

సీఎం నుండి ఫోన్ వచ్చిందని బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు

2023లో టీఆర్ఎస్ ను గద్దె దించి తీరుతామన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు, రైతులతో పాటు అన్ని వర్గాలు అసంతృత్తితో ఉన్నాయన్నారు. బండి సంజయ్ అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకింత భయమన్నారు. అక్రమ కేసులు, అరెస్టులతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరన్నారు. బండి సంజయ్ అరెస్టు.. జలియన్ వాలాబాగ్ ను తలపించిందన్నారు. సీఎం నుండి ఫోన్ వచ్చిందని గేట్లు బద్దలు కొట్టి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారన్నారు. పోలీస్ కమిషనర్ జనరల్ డయ్యర్ ను తలపించిండన్నారు.  బండి సంజయ్ ను ఉద్దేశించి ‘‘టైగర్ ఉన్నడు... జైలు నుండి వాపస్ వచ్చిండు.. ప్రతి కార్యకర్త బండి సంజయ్ లా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు.

 

ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. రూపొందించిన టాటా

విద్యార్థుల వద్దకే వ్యాక్సిన్​