ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప..కేసీఆర్ చేసిందేమి లేదు

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప..కేసీఆర్  చేసిందేమి లేదు

తెలంగాణలో నిరుద్యోగ యువత తీవ్ర అసహనంతో ఉందన్నారు బీజేపీ నేత తీన్మార్ మల్లన్న. ఇవాళ నిరుద్యోగ దీక్షకు వస్తున్న వేలాది మంది తరలివస్తుంటే వారిని అరెస్ట్ చేశారన్నారు. ఈ విధంగా దీక్షలను అడ్డుకుంటూ..ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప..కేసీఆర్ సమాజానికి చేసిందేమి లేదన్నారు.డిగ్రీ చదివిన వాళ్లకు ఉద్యోగాలివ్వాలా? అని ప్రభుత్వం అంటుందని..మరి ఐదో తరగతి చదువుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఏడోతరగతి పరీక్ష పెడితే ఇపుడున్న ఒక్క మంత్రి పాస్ కాడన్నారు కేసీఆర్ ఉద్యోగం, తన కుటుంబ ఉద్యోగాలు పోతే..తప్ప నిరద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు.తెలంగాణ రాకపోతే ఇవాళ  కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చేవా ? అని ప్రశ్నించారు. ఏడేళ్ల పాలనలో ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు.