
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. జీడీపీలో ముందు వరుసలో ఉన్నామని మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బ్లాక్ మనీ పట్టుకోలేదని ప్రధానిపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. ఐటీ రైడ్స్ చేస్తే మాత్రం కక్ష సాధింపు చర్యలు అంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. దేశం మొత్తమ్మీద వెతికినా ఇలాంటి సీఎం దొరకరని ఎద్దేవా చేశారు. తన పాలనలోని లోపాలు బయటపడే ప్రమాదం వచ్చినప్పుడల్లా ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీ మీద బురదజల్లడం, ప్రజలకు తన వల్లే మేలు జరుగుతుందని బిల్డప్ ఇవ్వడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదన్నారు. ఓవైపు భారీ వర్షాలు పడుతుంటే, ఈ టైమ్‌లో రెండు గంటలు ప్రెస్‌మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడటం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.