కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయింది.. ఏం చేస్తున్నాడో..

V6 Velugu Posted on Aug 25, 2021

‘తమ్ముడు ఈటల రాజేందర్ గెలుపు కోసం హుజురాబాద్ వెళ్తా’నని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణకు సేఫెస్ట్ పార్టీ బీజేపీనేనని ఆమె అన్నారు. తెలంగాణ వంద శాతం అభివృద్ధి కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని విజయశాంతి అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించిన పాటల సీడీని ఆమె విడుదల చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అధికార ప్రతినిధి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు.

‘రాష్ట్రంలో అనుకున్నట్టుగా అభివృద్ధి జరుగుతలేదు. ప్రజలు మనసుపెట్టి ఆలోచన చేసి బీజేపీకి మద్దతు పలకాలి. కేసీఆర్ లాంటి అవినీతి పరుడిని ఓడగొట్టాలి. కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయింది. ఏం చేస్తున్నాడో ఆయనకే తెలుస్తలేదు. ఆయన బ్యాలెన్స్ తప్పిండు. ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి అనవసరంగా బయటకు పంపానని అనుకుంటున్నట్లున్నడు. కేసీఆర్ నువ్వు రైట్ కాదు. నిజంగా నువ్వు రాంగే. ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెప్తారు. గద్దె దించుతారు. అందుకే ఆ స్కీమ్.. ఈ స్కీమ్ అని తిరుగుతున్నడు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుస్తున్నడు. 2023 ఎన్నికల్లో  తెలంగాణతో పాటు ఇండియాలో కూడా బీజేపీదే అధికారం. 
తమ్ముడు ఈటల రాజేందర్, నేను కలిసి ఉద్యమంలో పనిచేశాం. తమ్ముడు గెలుపు కోసం నేను త్వరలోనే హుజూరాబాద్ వెళ్తా. తమ్ముడు రాజేందర్ ను గెలిపిస్తం.. కేసీఆర్ ను ఓడగొడతం’ అని విజయశాంతి అన్నారు.
 

Tagged Bjp, vijayashanthi, Bandi Sanjay, Telangana, CM KCR, Eatala Rajender, Huzurabad, Huzurabad By election, Praja Sangrama Yatra

Latest Videos

Subscribe Now

More News