కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడు

కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడు

మంచిర్యాల జిల్లా : సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశాడన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ కు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. KCRకు  రవీందర్ గుడి కట్టి, పూజించే వాడన్నారు వివేక్. ఆయనకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉద్యమకారులను కేసీఆర్ అవమానించాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారన్నారు.