భళా బెంగళూరు.. 18 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ముంబైపై విక్టరీ

భళా బెంగళూరు.. 18 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ముంబైపై విక్టరీ
  • దంచికొట్టిన సాల్ట్‌‌‌‌‌‌‌‌, రజత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ.. పాండ్యా, రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ పోరాటం వృథా 

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో రెండు టాప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ల మధ్య జరిగిన పోరాటంలో రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు పైచేయి సాధించింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఫిల్‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌ (36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 78), రజత్‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ (20 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 53), విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (38 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 50) శివాలెత్తడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బెంగళూరు 18 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. 

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 240/4 స్కోరు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 225/5 స్కోరు చేసింది. చివర్లో రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 9 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 71 నాటౌట్‌‌‌‌‌‌‌‌) భారీ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌తో వణికించగా, హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా (22 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 40), రైన్‌‌‌‌‌‌‌‌ రికెల్టన్‌‌‌‌‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 37), సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (22 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 33) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. సాల్ట్‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

టాప్‌‌‌‌‌‌‌‌ లేపారు..
ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆర్సీబీ టాపార్డర్‌‌‌‌‌‌‌‌ పరుగుల వరద పారించింది. ట్రెంట్‌‌‌‌‌‌‌‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌ (1/50) బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్లు కోహ్లీ సిక్స్‌‌‌‌‌‌‌‌, సాల్ట్‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌తో  ఖాతా తెరిచారు. ఆ తర్వాత హార్దిక్‌‌‌‌‌‌‌‌ (1/39), బుమ్రాను కూడా వదల్లేదు. శాంట్నర్‌‌‌‌‌‌‌‌ (1/43) వేసిన ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో మూడు సిక్స్‌‌‌‌‌‌‌‌లు, ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో 22 రన్స్‌‌‌‌‌‌‌‌ దంచడంతో ఆర్సీబీ 71/0తో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను ముగించింది. 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సాల్ట్‌‌‌‌‌‌‌‌ 4, 4, 6  కొట్టాడు. ఈ క్రమంలో 21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ సాధించాడు. ఆ వెంటనే మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టగా, రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌ రెండు  ఫోర్లు  రాబట్టడంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో ఆర్సీబీ 115/0 స్కోరు చేసింది.

11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో శార్దూల్‌‌‌‌‌‌‌‌ (1/32) సాల్ట్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 120 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో రజత్‌‌‌‌‌‌‌‌ పటీదార్‌‌‌‌‌‌‌‌ 4, 6, 6, 6, 4, 6, 4, 6తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మధ్యలో ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టిన విరాట్‌‌‌‌‌‌‌‌ 37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ అందుకున్నాడు. కానీ మరో బాల్‌‌‌‌‌‌‌‌ ఆడి హార్దిక్‌‌‌‌‌‌‌‌ (15వ ఓవర్‌‌‌‌‌‌‌‌)కు వికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 17 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన రజత్‌‌‌‌‌‌‌‌ను 16వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో శాంట్నర్‌‌‌‌‌‌‌‌ వెనక్కి పంపాడు. 8 బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో స్కోరు 194/3గా మారింది. చివర్లో జితేష్‌‌‌‌‌‌‌‌ శర్మ (10) త్వరగా ఔటైనా.. టిమ్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ (34 నాటౌట్‌‌‌‌‌‌‌‌) 4, 6, 4, 6, 6 దంచడంతో ఆర్సీబీ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించింది.

ఆఖర్లో మెరిసినా..
ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ముంబైకి ఓపెనర్‌‌‌‌‌‌‌‌ రికెల్టన్‌‌‌‌‌‌‌‌ 6, 4, 6, 4, 6, 6తో మెరుపు ఆరంభాన్నిస్తే చివర్లో రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రోహిత్‌‌‌‌‌‌‌‌ (19) కూడా 6, 4, 4 దంచాడు. కానీ పిక్క కండరాలు పట్టేయడంతో హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ హర్ట్‌‌‌‌‌‌‌‌ కాగా సూర్య  క్రీజులోకి వచ్చాడు. 62/0తో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేను ముగించిన ముంబైకి 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ తగిలింది. ఐదు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో రికెల్టన్‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ (1)ను సుయాశ్ శర్మ (2/47) వెనక్కి పంపాడు. హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా  సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఖాతా తెరవగా, పదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో మూడు ఫోర్లు రావడంతో స్కోరు 99/2గా మారింది.

ఇక్కడి నుంచి హార్దిక్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీలతో రెచ్చిపోగా, 13వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సూర్య వెనుదిరిగాడు. మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌‌‌‌‌ జతయ్యాయి. రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ సిక్స్‌‌‌‌‌‌‌‌తో బ్యాట్‌‌‌‌‌‌‌‌ ఝుళిపించినా.. 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో హార్దిక్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో ముంబై 147/4 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఆఖరి 30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 94 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉండగా  నమన్‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌ (1) నిరాశపర్చాడు. చివర్లో శాంట్నర్ (8 నాటౌట్‌‌)ను  ఓ ఎండ్‌‌లో ఉంచి రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌  భారీ సిక్సర్లతో చెలరేగినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాడు. 

సంక్షిప్త స్కోర్లు

  • బెంగళూరు: 20 ఓవర్లలో 240/4 (సాల్ట్‌‌‌‌‌‌‌‌ 78, రజత్‌‌‌‌‌‌‌‌ 53, కోహ్లీ 50, శార్దూల్‌‌‌‌‌‌‌‌ 1/32).
  • ముంబై: 20 ఓవర్లలో 225/5 (రూథర్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ 71*, పాండ్యా 40, సుయాశ్‌‌ 2/47).