గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం బీజేపీకే సాధ్యం

గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం బీజేపీకే సాధ్యం

దేశ చరిత్రలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం బీజేపీకే సాధ్యం అవుతోందిన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పోడు భూములకు పట్టాలు ఇస్తానని.. 12% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మోడీ కంకణం కట్టుకున్నారని చెప్పారు. రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ.. రీ ఓపెన్ కోసం తన కృషితోనే ప్రధాని మోడీ నిధులు కేటాయించారన్నారు. భారత రాష్ట్ర సమితి ప్రచారం కోసం కేసీఆర్ 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడని విమర్శించారు. హైదరాబాద్ లో కావాలనే కేసీఆర్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు కేసీఆర్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభ జన సమీకరణ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తన నివాసంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు వివేక్. కనివినీ ఎరుగని రీతిలోబీజేపీ సభ జరగబోతుందని ప్రతీ ఒక్కరూ రావాలని కోరారు.