కరప్షన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌దే ఫస్ట్ ప్లేస్

కరప్షన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌దే ఫస్ట్ ప్లేస్

కేసీఆర్‌‌‌‌.. డల్లాస్‌‌‌‌ ఏమైంది..?

మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు వివేక్‌‌‌‌ వెంకటస్వామి ప్రశ్న

వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు

సీఎం మాత్రం సోయిలేకుండా ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఉన్నరు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ‘‘హైదరాబాద్‌‌‌‌ను డల్లాస్‌‌‌‌గా, క్లీన్‌‌‌‌ సిటీగా మారుస్తానని సీఎం కేసీఆర్‌‌‌‌ హామీ ఇచ్చి ఆరేళ్లవుతోంది. డల్లాస్‌‌‌‌, డ్రైనేజీ సిస్టం ఏమైంది” అని మాజీ ఎంపీ, బీజేపీ కోర్‌‌‌‌ కమిటీ సభ్యుడు వివేక్‌‌‌‌ వెంకటస్వామి ప్రశ్నించారు. హైదరాబాద్‌‌‌‌లో అతి భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీస సౌకర్యాలు కల్పించాలనే సోయిలేకుండా సీఎం కేసీఆర్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో కూర్చున్నరని విమర్శించారు. రాష్ట్రాన్ని తుగ్లక్‌‌‌‌ లెక్క పాలిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మీడియాకు వివేక్ ఓ వీడియో రిలీజ్‌‌‌‌ చేశారు. సెక్రటేరియట్‌‌‌‌ కూల్చే బదులు.. మంచి డ్రైనేజ్‌‌‌‌ సిస్టం కడితే ప్రజలు సంతోషించేవారని చెప్పారు. రూ.36 వేల కోట్లతో పూర్తి చేసే కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల పేరుతో లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. కేవలం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రజలకు మంచి డ్రైనేజీ సిస్టం వచ్చేదని, కానీ ఆ దిశగా కేసీఆర్‌‌‌‌ ఆలోచన చేయడం లేదన్నారు. హరితహారం పేరుతో హార్టికల్చర్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ పెట్టి ప్రజలను తప్పదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 3 లక్షల కోట్ల అప్పు చేసి, దేశంలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

కరప్షన్‌‌‌‌లో మొదటి స్థానం

దేశంలో కరప్షన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌ మొదటి స్థానంలో ఉన్నారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను కమీషన్ల రాష్ట్రంగా, తాగుబోతుల స్టేట్‌‌‌‌గా మార్చారని విమర్శించారు. డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌ ఇండ్లకు కేంద్రం నుంచి సబ్సిడీ తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి చెప్పినా పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎలక్షన్లలో ఓట్లు కొని గెలుస్తానని సీఎం అనుకుంటున్నారని, ప్రజలు ఆయన మాయమాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ మధ్య మంత్రి కేటీఆర్‌‌‌‌ హైదరాబాద్​లో పర్యటించినప్పుడు సిటీకి ఏం చేశారని ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రం వస్తే బాగుపడుతుందని అందరూ భావించరాదని, కానీ ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు.

For More News..

కేసీఆర్ కారును జనం ముంచుతరు

నీళ్లున్నప్పుడు రాలేదు గాని.. పొయినంక వస్తరా?

పానీ మే హైదరాబాద్.. ఫామ్​హౌస్ మే కేసీఆర్