కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వం

కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వం

సీఎం కేసీఆర్ ది వాడుకొని వదిలేసే మనస్తత్వమని విమర్శించారు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి. జగన్ ను కూడా కేసీఆర్  అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారని అన్నారు. కమిషన్ల కోసమే  కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నారని మండిపడ్డారు.  తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వివేక్ వెంకట స్వామి. మనవడు వీర్ వెంకటస్వామి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించుకున్నామని చెప్పారు. తన తండ్రి కాకా పుట్టినరోజునే మనవడు కూడా పుట్టాడన్నారు.