తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగం..

తెలంగాణ బీజేపీలో అసమ్మతి రాగం..
  • హైదరాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్ అభ్యర్థుల ప్రకటనపై నేతల అసంతృప్తి
  • నిన్నామొన్నా వచ్చినవారికి టికెట్లు ఎలా ఇస్తరని హైకమాండ్పై గుర్రు
  • కనీసం పార్టీ సభ్యత్వంలేనోళ్లకు పీటిచ్చారని మండిపాటు
  • ఫస్ట్స్టులో తమ పేరులేకపోవడంపై తీవ్రనిరాశలో డీకే అరుణ, జితేందర్రెడ్డి
  • త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు
  • రెండో జాబితాలో నాకు టికెట్ ఇయ్యకుంటే నా దారి నేను చూస్కుంట: ఎంపీ పోయం

రాష్ట్రంలో 9 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఫస్టు టెస్టుపై బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరా బాద్, మల్కాజిగిరి, జహీరాబాద్ అభ్య ర్థుల ప్రకటనపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను కాదని నిన్నా మొన్నా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీ సభ్యత్వంలేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని బీజేపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. కాగా ఫస్ట్ లిస్టులో పేర్లు రాకపోవడంతో ఆదిలాబాద్ంపీ. సోయం బాపూరావుతో సహా సీనియర్లు డీకే అరుణ. జితేందర్రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు.

లోకసభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఫస్ట్ టెస్ట్ ను నిన్న విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 పార్ల మెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిం ది. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా... నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. అయితే మల్కాజిగిరి నుంచి టికెట్ ఆశించిన బీజేపీ సీనియర్ నేత మురళీ ధర్ రావు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ ఎంపీటికెట్ మాధవీలతకు ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు నియోజకవర్గంలో ఇన్నాళ్లు పార్టీ తరపున పనిచేసిన ఉమా మహేంద్ర, పొన్నం వెంకటరమణారావు, ఉమారాణివంటినేతలు హైదరాబాద్ మాధవీలత అభ్యర్థిత్వాన్ని తప్ప్ప బడుతున్నట్లు తెలిసింది. ఓల్డ్ సిటీలో ఓవైసీకి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తున్న తమసుకాదని, కనీసం పార్టీ సభ్యత్వంలేనివ్య క్తికి ఎలా టికెట్ ఇస్తారని బీజేపీ అధిష్టానాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.

 టికెట్ కోసమే బీజేపీలోకి

 జహీరాబాద్ నుంచి ఆలె నరేంద్ర  కుమారుడు ఆలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి, కుమారుడు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ ఇద్దరిని కాదని కొత్తగా బీజేపీలోకి వచ్చిన బీడీ పాటిల్కు టికెట్ ఇవ్వదంపట్ల పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి బాస్కర్, బాగారెడ్డి, వారి దర్జీయులు నిరసనవ్యక్తం చేసినట్లు తెలిసింది. బీబీ పాటిల్ గత పదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృ ద్దీ చేయలేదని, జహీరాబాద్లో బీజేపీ గెలి అవకాశాలు ఉండటంతో కేవలం టికెట్ కోసమే పాటిల్ బీజేపీలోకి వచ్చాడని అసం తృష్ణ నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది.

త్వరలో భవిష్యత్ కార్యాచరణ

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్న బీజేపీ హైకమాండ్ ప్రకటించడం పట్ల బీజేపీ సీనియర్ నేత మురళీ ధర్ రావు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) వేదికగా కార్యకర్తలను ఉద్దేశిం చి మురళీధర్ రావు ట్వీట్ చర్చనీయాం శంగా మారింది. "కొన్నేళ్లుగా మల్కాజి గిరిలో నా కోసం పనిచేసిన కార్యకర్తలకు దన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని పర్చన ల్గా కలుస్త, ఆపై భవిష్యత్ కార్యాచరణు ప్రకటిస్త' అని పోస్టు పెట్టారు. దీంతో ఆయన పార్టీ మారుతారా అన్న ప్రచారం మొదలైంది. దీనిపై మురళీధర్ రావు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా మల్కాజిగి రి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

నా దారి నేను చూస్కుంట : ఎంపి సోయం బాపూరావు 

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లోక్ సభ టికెట్ రాకుండా. కొంతమంది పార్టీ లీడర్లు అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'బీజేపీ ఫస్ట్' లిస్టులో నాకు టికెట్ దక్కకుండా పార్టీ అగ్ర నేతలే అడ్డుపడ్డరు అదివాసీనేతనైనా నాకు టికెట్ దక్కకుండా పావులు కదిపారు. నేను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకుపట్టు కుంది. నేను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదు, రెక్కల మీద ఆధారపడిన పక్షిని, స్వతహాగా ఎదిగిన వ్యక్తిని. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నరు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. జెడ్పీటీసీల ను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మె ల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది. రెండో లిస్ట్లో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. టికెట్ రాకుంటే నా దారి నేను చూసుకుంట ఎవరికీ తలొగేది లేదు. ఆదిలాబాద్ ఎంపీ సీటు నాడే గెలిచేది నేనే. పార్టీ ఏదనేది అధిష్టానం ఆలోచించుకోవా 'అని సోయం బాపూరావు స్పష్టంచేశారు.