ఐడీపీఎల్, హెచ్ఎంటీ భూములను కాపాడండి : గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు

ఐడీపీఎల్, హెచ్ఎంటీ భూములను కాపాడండి :  గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ బీజేపీ నాయకులు గవర్నర్‌ తమిళి సైను రాజ్ భవన్ లో కలిశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థానిక బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసి, అమ్ముకుంటున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలు ఉన్న ప్రాంతంలో ఒక ఎకరానికి రూ.30 కోట్ల ధర పలుకుతోందని, ఆ భూములను కాపాడాలని కోరారు.

ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన భూ కబ్జాలపై స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని బీజేపీ నేత మల్లారెడ్డి చెప్పారు. ఈ రెండు కంపెనీలకు మొత్తం 880 ఎకరాల భూమి ఉందని, ఐడీపీఎల్ కంపెనీలో 100 ఎకరాలు, హెచ్ఎంటీ కంపెనీకి చెందిన 50 ఎకరాల భూమిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూములను కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.