బీజేపీ నేతల పడవ ప్రయాణం.. ఓరుగల్లులో బస్టాండ్లేకపోవడం సిగ్గుచేటు

బీజేపీ నేతల పడవ ప్రయాణం.. ఓరుగల్లులో బస్టాండ్లేకపోవడం సిగ్గుచేటు

కాశీబుగ్గ, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మాజీ సీఎం కేసీఆర్​కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీజేపీ రాష్ర్ట నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎద్దేవా చేశారు. గురువారం వరంగల్​సిటీలోని బస్టాండ్​నిర్మాణానికి తవ్విన ఏరియాలో వరద చేరడంతో బీజేపీ నేతలు అందులో పడవ ప్రయాణం చేశారు.

ఈ సందర్భంగా రవికుమార్​మాట్లాడుతూ కాకతీయుల రాజధాని ఓరుగల్లులో బస్టాండ్​లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కాంట్రాక్ట్ పనుల కమీషన్లపై ఉన్న శ్రద్ధ కాంగ్రెస్​ నేతలకు అభివృద్ధిపై లేదని ఆరోపించారు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో మంత్రి కొండా సురేఖ నిర్లక్ష్యం కారణంగా గుంతల్లో నీరు నిలిచి చెరువులా మారిందని చెప్పారు.

వరంగల్​ఆత్మగౌరవ పోరాట మహా ధర్నా –-2 పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​నేతలకు ఉచిత పడవ ప్రయాణ నిరసన చేపట్టినట్టుగా తెలిపారు. బీజేపీ పార్టీ నేతలు సతీశ్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, పుల్లారావు, హరిశంకర్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.