కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలి
  • టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో బీజేపీ నేతలు

ముషీరాబాద్/ మెహిదీపట్నం/ పద్మారావునగర్/ షాద్‌‌నగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టిఫిన్ బైఠక్ ప్రోగ్రామ్​ను నిర్వహిస్తున్నట్లు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు  ఎన్. గౌతమ్ రావు అన్నారు.  మంగళవారం ఓయూ కాలనీలో జరిగిన టిఫిన్ బైఠక్ ప్రోగ్రామ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. సిటీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు టిఫిన్ బైఠక్​  ప్రోగ్రామ్​ను నిర్వహించారు. 

బీజేపీ నాయకుడు దేవరవంశీ ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్ ఎస్బీఐ కమ్యూనిటీ హాల్‌‌లో, సనత్‌‌నగర్​లో లక్ష్మీనారాయణ పార్కులో,  షాద్ నగర్ పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు జరిగాయి.  ఆయా ప్రోగ్రామ్స్​లో గద్వాల జిల్లా ఇన్ చార్జి బి. వెంకట్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నేత పాపారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఆనంద్ గౌడ్,  సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా పార్టీ  ప్రెసిడెంట్​ శ్యాంసుందర్​ గౌడ్​, బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్​ రెడ్డి, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,  మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణు వర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.