బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

హైదరాబాద్, సికింద్రాబాద్, వెలుగుహైదరాబాద్​లో కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ తో చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్ కు వెళ్లాలనుకున్న బీజేపీ నేతల ప్రయత్నాలకు సర్కార్ బ్రేక్ వేసింది. ‘సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ కరోనా’ ప్రోగ్రామ్​ను అడ్డుకుంది. సీనియర్ లీడర్లు కె.లక్ష్మణ్, రాజాసింగ్ లను హౌస్ అరెస్టు చేశారు. రాంచందర్​రావును పోలీస్​స్టేషన్​కు తరలించారు.

పర్మిషన్ ఇవ్వకపోవడంతో..

కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతుండటం, సిటీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతుండటంతో దీన్ని కేసీఆర్ దృష్టికి తెచ్చేందుకు బీజేపీ నేతలు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్.. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరుతూ సీఎంవోకు లెటర్ రాశారు. శుక్రవారం తాము ‘సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ కరోనా’ పేరుతో ప్రగతి భవన్ కు వచ్చి సీఎంను కలుస్తామని, అందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అయితే సీఎంవో నుంచి పిలుపు రాకపోవడంతో తాము ప్రగతి భవన్ కు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం ఉదయమే ఈ ముగ్గురు నేతల ఇళ్ల ముందు మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. లక్ష్మణ్, రాజాసింగ్ ఇంటికే పరిమితం కాగా, రాంచందర్ రావు ప్రగతి భవన్ వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రజల ప్రాణాలతో సీఎం చెలగాటం: లక్ష్మణ్

ప్రజల ప్రాణాలతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతోందని బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ లక్ష్మణ్ మండిపడ్డారు. దేశంలో అతి తక్కువ కరోనా టెస్టులు చేస్తున్నది తెలంగాణ ఒక్కటేనని ఆరోపించారు.కరోనా కట్టడి విషయంలో రాష్ర్ట సర్కారు నిర్లక్ష్యం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని బీజేపీ సిటీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు ఆరోపించారు. కేసీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరితే స్పందించలేదని, తామే ప్రగతి భవన్ కు వెళ్లాలనుకుంటే అరెస్టు చేశారన్నారు.

రాంచందర్ రావుకు పొంగులేటి సంఘీభావం

ఎమ్మెల్సీ రాంచందర్ రావును అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. ఓయూ పీఎస్ లో ఉన్న రాంచందర్ రావును పొంగులేటి కలిసి తన సంఘీభావాన్ని ప్రకటించారు. కరోనా సోకిన పేషెంట్లకు, జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్.. ఆరోగ్య మంత్రిగా ఉన్నది రాష్ట్రానికా? గాంధీ ఆస్పత్రికా? అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. రాష్ర్టం మొత్తం ఆరోగ్య వ్యవస్థను షట్ డౌన్ చేసి, గాంధీ పైనే భారం వేయడంలో ఈటల ఉద్దేశమేంటన్నారు.

గవర్నర్ నిమ్స్ కు వెళ్తే సీఎం గడప దాటలే