ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తహసీల్దార్లకు బీజేపీ నాయకుల వినతి

ఉద్యోగ నియామకాలు చేపట్టాలని తహసీల్దార్లకు బీజేపీ నాయకుల వినతి

గండిపేట/జీడిమెట్ల/ శంషాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ భృతి అందజేయాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వై. శ్రీధర్, మైలార్‌‌దేవ్‌‌పల్లి డివిజన్‌‌ కార్పొరేటర్‌‌ తోకల శ్రీనివాస్‌‌రెడ్డి, అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత డిమాండ్‌‌ చేశారు. మంగళవారం బీజేపీ యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్‌‌ వినయ్‌‌ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌‌ తహసీల్దార్‌‌కు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాలు లేక రాష్ట్రంలోని నిరుద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు.  నిరుద్యోగ భృతి మొత్తం చెల్లించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌‌ మల్లేష్‌‌, డివిజన్‌‌ యువ మోర్చా అధ్యక్షుడు రాకేశ్​, జిల్లా వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ శ్రీకాంత్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్​లో..

ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతూ మేడ్చల్​జిల్లా బీజేవైఎం నాయకులు సైతం కుత్బుల్లాపూర్​తహసీల్దార్ ​సంజీవ్​రావుకు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు.  బీజేవైఎం రాష్ట్ర నాయకుడు దయాకర్​, జిల్లా ప్రధాన కార్యదర్శి వారాల మహేష్​తదితరులు పాల్గొన్నారు.  శంషాబాద్ మండల తహసీల్దార్ కు సైతం   బీజేపీ, బీజేవైఎం నాయకులు బుక్కా ప్రవీణ్, వంశీయాదవ్, చేవెళ్ల మహేందర్ వినతిపత్రం ఇచ్చారు.