అది బీజేపీ కాదు.. మోదీ పరివార్ : సోషల్ స్టేటస్ లు మార్చేసిన లీడర్స్..!

అది బీజేపీ కాదు.. మోదీ పరివార్ : సోషల్ స్టేటస్ లు మార్చేసిన లీడర్స్..!

సోషల్ మీడియాను వాడుకోవడంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతే ఎవరైనా అనటంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ అదికారంలోకి రావడానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల నెలకొన్న వ్యతిరేకత ఒక కారణమైతే, నరేంద్ర మోడీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా బలమైన కారణం అని చెప్పాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితిని అయినా తనకు అనుకూలంగా మార్చుకోవటంలో నరేంద్ర మోడీ దిట్ట అని చప్పచ్చు. 2019లో " ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ " అన్న స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ 2024 ఎన్నికల కోసం సోషల్ మీడియాను వాడుకుంటోంది.

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మోడీకి కుటుంబం లేదంటూ చేసిన వ్యాఖ్యలకు మోడీ " భారతీయులంతా నా కుటుంబమే " అని బదులివ్వగా, బీజేపీ క్యాడర్ మోడీకి మద్దతుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ కి " మోడీకా పరివార్ " అన్న ట్యాగ్ లైన్ ను యాడ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ ను ఫాలో అయిన వారిలో బీజేపీ నాయకులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జేపీ నడ్డా, అనురాగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.

ఆదివారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ కుటుంబవాదులపై దాడి చేస్తున్నారని, ఆయనకు కుటుంబం లేదని అన్నారు. మోడీ అసలు హిందూయే కాదని, తన తల్లి చనిపోతే మోడీ ఎందుకు గుండు గీయించుకోలేదో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నాడు. లాలూ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీజేపీ క్యాడర్ ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.