కేటీఆర్ మాటలతో మోసపోయాం

కేటీఆర్ మాటలతో మోసపోయాం

ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకుల ధర్నా

హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న ఇండ్ల రిజిస్టేషన్ సమస్యపై బీజేపీ నాయకులు బీయన్ రెడ్డి నగర్ చౌరస్తాలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. బీయన్ రెడ్డి నగర్, నాగోల్ డివిజన్‌లతో పాటు వివిధ కాలనీల నుంచి బాధితులు ఈ దీక్షకు మద్దతు తెలపడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ దీక్షలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారిస్తామని మాట ఇచ్చిన కేటీఆర్, కవిత, జగదీశ్వర్ రెడ్డి ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి చూడలేదని సామ రంగారెడ్డి అన్నారు. ‘ఎన్నికల సమయంలో ఇదే సమస్యపై హామీ ఇఛ్చి పరిష్కరించకుండా ప్రజలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోసం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఇక్కడ రిజిస్టేషన్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారు. కాలనీ వాసులు ఈ సమస్య గురించి కలువని మంత్రి లేడు, నాయకుడు లేడు. అయినా సమస్యకు పరిష్కారం చూపించలేదు. మంత్రి హోదాలో ఉన్న వీళ్లు ఇలాంటి అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు కూడా ఇదే సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోంది. స్థానికులు, బీజేపీ నాయకులు ఈ సమస్య గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. ఎమ్మెల్యే తప్పుడు జీఓ కాపీలు తీసుకువచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేస్తుంటే.. మోసపోయే ఓపిక తమకు లేదని కాలనీ వాసులు ప్రత్యక్షంగా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కరించకుండా.. తన సొంత సమస్యను పరిష్కరించుకొని మూసీ పరివాహక చైర్మన్ పోస్ట్ తెచ్చుకున్నాడు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరంలోగా రిజిస్టేషన్ సమస్య పరిష్కరించకుంటే తన పదవికి రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలి’అని ఆయన డిమాండ్ చేశారు.

For More News..

బెంగాల్‌లో దారుణం.. ఒకే ఇంట్లో అనుమానాస్పదంగా అయిదుగురు మృతి

గోవా సీఎం ఫోన్‌కు బెదిరింపు మెసెజ్..

కీసర తహశీల్దార్ నాగరాజు రూ. కోటి లంచం కేసులో మరో నిందితుడు సూసైడ్