The Raja Saab Box Office: మిక్సెడ్ టాక్‌తో రాజా సాబ్ కలెక్షన్లు డ్రాప్.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

The Raja Saab Box Office: మిక్సెడ్ టాక్‌తో రాజా సాబ్ కలెక్షన్లు డ్రాప్.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ (The Raja Saab) బాక్సాఫీస్ పోరులో యుద్ధం చేస్తోంది. హార్రర్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మిక్సెడ్ టాక్ రావడంతో, సినిమాపై ఉన్న భారీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ఈ మిక్సెడ్ టాక్ నేరుగా కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా వసూళ్లపై స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. మేకర్స్ మాత్రం జనవరి 9న ఒక్కరోజు ఓపెనింగ్ ఫిగర్స్‌తోనే పోస్టర్ విడుదల చేసి, ఆ తర్వాత కలెక్షన్లను ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో, మూడు రోజుల్లో ‘రాజా సాబ్’ నిజంగా ఎంత వసూలు చేసిందనే విషయంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ ట్రాకింగ్ వెబ్‌సైట్ Sacnilk మరియు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ మూడు రోజుల్లో (జనవరి 9 నుంచి 11వరకు) ఇండియా వ్యాప్తంగా రూ.108 కోట్ల నెట్ మరియు రూ.129 కోట్ల గ్రాస్ సాధించనట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్ మార్కెట్లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. ఓవరాల్.. వరల్డ్ వైడ్గా రాజాసాబ్ మూడు రోజుల్లో రూ.161కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చినట్లుగా Sacnilk వెబ్ సైట్ వెల్లడించింది. 

రోజువారీ ఇండియా నెట్ కలెక్షన్లు:

జనవరి 8 (ప్రీమియర్స్): రూ. 9.15 కోట్లు

జనవరి 9 (ఫస్ట్ డే): రూ. 53.75 కోట్లు

జనవరి 10 (సెకండ్ డే): రూ. 26 కోట్లు

జనవరి 11 (మూడో రోజు – ఆదివారం): రూ. 19.1 కోట్లు

ఈ లెక్కల ప్రకారం, మూడు రోజుల్లో ఇండియాలో మొత్తం రూ.108 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, సినిమా రూ.161 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మేకర్స్ మాత్రం ఫస్ట్ డే (శుక్రవారం) రూ.112 కోట్ల ఓపెనింగ్ వచ్చినట్లు ప్రకటించారు. ఆ తర్వాత అధికారికంగా ఎలాంటి వసూళ్ల అప్‌డేట్స్ ఇవ్వకపోవడం గమనార్హం.

మరోవైపు, వీకెండ్‌లో కూడా సినిమా నిలకడగా రాణించలేకపోయింది. శనివారం దేశీయ కలెక్షన్లలో 51 శాతం తగ్గుదల, ఆదివారం మరో 20 శాతం డ్రాప్ నమోదవడం, ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పటికీ ఒత్తిడిలోనే ఉందని స్పష్టం చేస్తోంది.

వివిధ భాషలలో రాజాసాబ్ బాక్సాఫీస్ వసూళ్లు

వివిధ ప్రాంతాల వసూళ్లు చూస్తే, ఈ చిత్రానికి మెయిన్గా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూడు రోజుల లెక్కలు గమనిస్తే, తెలుగు మార్కెట్ నుంచే నికరంగా సుమారు రూ.91 కోట్లు రాబట్టింది. హిందీ వెర్షన్ రూ.15.75 కోట్లు వసూలు చేయగా, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు కలిపి రూ.1 కోటికి కొంచెం మించిన వసూళ్లను నమోదు చేశాయి.

అయితే, తెలుగుతో పాటుగా ఓవర్సీస్ మార్కెట్లలో కూడా రాజాసాబ్ మంచి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమెరికాలో మంచి స్పందన లభించగా, మొత్తం అంతర్జాతీయ వసూళ్లు $3 మిలియన్ మార్కును దాటాయి. అంటే దాదాపు రూ.31 కోట్లకి పైగా ఓవర్సీస్లో వచ్చాయి. ఒక్క నార్త్ అమెరికాలోనే $ 2.2 మిలియన్ మార్కు సాధించినట్లు రాజాసాబ్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే.. సుమారు రూ.20 కోట్లు వసూళ్లు అందుకుంది.

ఈ అన్ని వసూళ్లను కలిపి చూస్తే, సినిమా మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌ను సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే, గ్రాస్ కల్లెక్షన్లపైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడే మరింత క్లారిటీ వస్తుంది.