ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కోటా కింద సీనియర్ గ్రేడ్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు: 97.
విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ గ్రేడ్– II (స్టెనో) 12, ట్యాక్స్ అసిస్టెంట్ (టీఏ) 47, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 38.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II (స్టెనో): గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా సమాన అర్హత ఉండాలి.
టాక్స్ అసిస్టెంట్ (టీఏ): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 ఉంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులందరికీ రూ.250.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 30.
సెలెక్షన్ ప్రాసెస్: క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు incometaxmumbai.gov.in వెబ్ సైట్ను సందర్శించండి.
