మంత్రుల క్యాంపు ఆఫీసుల ముట్టడి .. బీజేపీ లీడర్ల అరెస్ట్ 

మంత్రుల క్యాంపు ఆఫీసుల ముట్టడి ..  బీజేపీ లీడర్ల అరెస్ట్ 

రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ సిటీ: ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్​చేస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ లీడర్లు గురువారం మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసులు ముట్టడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, గృహలక్ష్మి.. వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటూ డిమాండ్ ​చేశారు. కరీంనగర్‌‌‌‌లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ ముఖ్యనేతలను తెల్లవారుజామునే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి,  లీడర్లు గుగ్గిలపు రమేశ్‌‌, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వాసుదేవ రెడ్డి, సత్యనారాయణరావు, ప్రవీణ్ రావు, వెంకట్ రెడ్డి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో ఉద్రిక్తత

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ క్యాంప్ ఆఫీస్‌‌ను బీజేపీ లీడర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  పోలీసులు క్యాంప్ ఆఫీస్ ముందు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ లీడర్లను అరెస్ట్​చేసి స్టేషన్‌‌కు తరలించారు. లీడర్లు మల్లారెడ్డి, గోపి, రాజు, శ్రీనివాస్, రమాకాంత్, రవీందర్, కమలాకర్, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. 

ముందస్తు అరెస్టులు

గంగాధర/ కొత్తపల్లి: మంత్రి గంగుల కమలాకర్​ఇంటి ముట్టడి సందర్భంగా బీజేపీ గంగాధర, కొత్తపల్లి మండల, పట్టణ లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్​చేశారు. కొత్తపల్లి పట్టణ అధ్యక్షుడు శేఖర్, గుడిపాక రాములు, మెరుగు పరుశురాం, బైరెడ్డి వంశీ, నరేశ్​, రాము, అశోక్​ తదితరులను ఉదయాన్నే అరెస్టు చేసి పోలీస్​స్టేషన్లకు తరలించారు.