అసోంలో ఆధిక్యంలో బీజేపీ

అసోంలో ఆధిక్యంలో బీజేపీ

దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. దాద్రా నగర్ హావేలిలో శివసేన ముందజలో ఉండగా.. మధ్యప్రదేశ్ (ఖంద్వా), హిమాచల్ ప్రదేశ్ (మండి) లోక్ సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అసోం బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ప్రారంభ ఎన్నికల లెక్కింపులో మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో యూపీపీఎల్ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. బీహార్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లో ఒక స్థానంలో ఆర్జేడీ ఆధిక్యంలో ఉంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ సెగ్మెంటులో కాంగ్రెస్ అభ్యర్థి జీతేష్ అంతపుర్కార్ తన సమీప బీజేపీ అభ్యర్థి సుభాష్ సబ్నేపై 1624 ఓట్ల ముందంజలో నిలిచారు.

హుజూరాబాద్ లైవ్ అప్డేట్స్ కోసం ..