అటు రాజుల కాలం నుంచి ప్రస్తుత ప్రజాస్వామ్య పాలన వరకు.. ఒక రాజ్యం ఇంకో రాజ్యంపై దాడి చేసినప్పుడు యుద్ధనీతిని పాటించడం పరిపాటి. ప్రజలపై నేరుగా దాడులకు దిగకపోవడం, మహిళలు, చిన్నారులను చంపకపోవడం, ఆసుపత్రులు, విద్యాసంస్థల జోలికి వెళ్లకపోవడం.. ఇలా కొన్ని నియమాలు పాటించేవారు. కానీ ప్రస్తుత యుద్ధంలో అమెరికా యుద్ధనీతి పాటించడంలేదని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ లోని మహాత్మాగాంధీ ఆసుపత్రి ధ్వంసమైన తీరును వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీ. యుద్ధం మొదలైన తర్వాత సిటీలోని ఆస్పత్రులపైనా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు రిపోర్టులు బయటకొస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్ 11 దేశాలపై దాడి చేసినా.. ఒక్క ఆస్పత్రిపైనా దాడి చేయలేదని చెబుతున్న అక్కడి రిపోర్టర్.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో వందల ఆస్పత్రులు, స్కూళ్లపై దాడులు చేసిన.. పిల్లలను అన్యాయంగా చంపినట్లు చెప్పుకొచ్చాడు ఆ రిపోర్టర్. టెహ్రాన్ సిటీలోనే పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ ఆస్పత్రి పేరు మహాత్మా గాంధీ ఆస్పత్రి.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ గాంధీ ఆస్పత్రి ఇప్పుడు ధ్వంసం అయ్యింది.. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎక్కువయ్యాయి.
2026 ఏప్రిల్ 13న ఇరాన్ అమెరికా చేస్తున్న విధ్వంసాన్ని చూపిస్తూ వీడియో రిలజ్ చేసింది. ఇండియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ ఆ వీడియోను షేర్ చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో దారుణంగా ధ్వంసమైన టెహ్రాన్ లోని మహాత్మా గాంధీ ఆసుపత్రి చూపిస్తూ.. చిన్న పిల్లలకు ఉద్దేశించిన ఆసుపత్రిపై దాడులు చేయడం.. ఇదెక్కడి యుద్ధనీతి అంటూ ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది.
►ALSO READ | చర్చల తీరును మార్చేసిన నెతన్యాహు ఫోన్ కాల్
ఇరాన్ ఇప్పటి వరకు 11 దేశాలపై దాడి చేస్తో ఒక్క ఆసుపత్రిని కూడా టార్గెట్ చేయలేదని రిపోర్టర్ తెలిపాడు. అదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లోని 600 హాస్పిటల్స్ పైన దాడులు చేశాయి.. 60 స్కూళ్లను ధ్వంసం చేశాయని తీవ్ర ఆవేదన భరితమైన కంఠంతో వెల్లడించాడు. మహాత్మా గాంధీ ఆస్పత్రి 2026 మార్చి 02న డ్యామేజ్ అయినట్లు రాయిటర్స్ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.
Mahatma Gandhi Hospital, Tehran. pic.twitter.com/NpvbmN32sR
— Iran in India (@Iran_in_India) April 12, 2026
