యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే మరింత లీన్ అండ్ రగ్గడ్ లుక్‌లో, ఒత్తైన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో కనిపించనున్నాడు.
ఈ క్రమంలోనే మేకర్స్ తారక్ క్రేజీ లుక్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్కి ట్రీట్ ఇచ్చారు. జిమ్‌లో ఎన్టీఆర్ వర్కవుట్స్ చేస్తున్న ఫోటో ఒకటి పంచుకున్నారు. ఇపుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఇందులో ఎన్టీఆర్ కెమెరాకు వెనుకవైపు నిలబడి తన చిసెల్డ్ బ్యాక్‌ను ప్రదర్శించారు.
The quieter it gets…
— NTR Arts (@NTRArtsOfficial) April 13, 2026
the louder it’s about to be. ⚡🔥#NTRNeel @tarak9999 pic.twitter.com/NT0lPwa0eW
ఎన్టీఆర్ స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేస్తూ “Built. Not bought. #NTRNeel” అని క్యాప్షన్ ఇవ్వడం విశేషం. NEEL31 ప్రాజెక్ట్ కోసం తన ఫిట్ నెస్ నిర్మించబడింది. కొనబడలేదు అని తారక్ అనడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ ఫోటో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, తమ హీరో ఇంతలా కష్టపడుతున్నాడంటే ‘డ్రాగన్’లో ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని భావిస్తున్నారు.
ఎన్టీఆర్ 31 స్టోరీ బ్యాక్ డ్రాప్:
ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 31వ చిత్రం. ఈ సినిమా కథాంశం కోల్ కతా బ్యాక్ డ్రాప్, పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అణగారిన వర్గాల కోసం పోరాడే ఒక నాయకుడి కథతో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అలాగే, మరో కథ కూడా వైరల్ అవుతుంది.. 1969 కాలంలో చైనా, భూటాన్, భారతదేశ సరిహద్దుల దగ్గర జరిగే భావోద్వేగాలతో కూడిన యాక్షన్ కథగా రూపొందుతోందని తెలుస్తోంది. మూవీ టైటిల్ & టీజర్ రిలీజ్ అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
►ALSO READ | Jana Nayagan Leak: ‘జన నాయగన్’ లీక్ కేసు.. ఆరుగురు అరెస్ట్, 300 లింకులు బ్లాక్!
తారక్తో రుక్మిణీ:
ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్ కూడా నటిస్తున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
The beast mode is about to ignite again 🔥#NTRNEEL next schedule begins soon.
— #NTRNeel (@NTRNeelFilm) November 6, 2025
Man of Masses @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries pic.twitter.com/8KBZloMI7x
