Bharata Varsha Glimps: భారీ హిస్టారికల్ మూవీతో గోపి చంద్.. టైటిల్ గ్లింప్స్‌ గూస్‌బంప్స్

Bharata Varsha Glimps: భారీ హిస్టారికల్ మూవీతో గోపి చంద్.. టైటిల్ గ్లింప్స్‌ గూస్‌బంప్స్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా టైటిల్తో పాటుగా గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు పెంచేశారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు “భరతవర్ష” (BharataVarsha) టైటిల్ కన్ఫామ్ చేశారు. ట్యాగ్‌లైన్: “సాగ ఆఫ్ శూలా”.

టైటిల్కి తగ్గట్టుగానే గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. యుద్ధ వీరుడిగా గోపిచంద్ చేసే సాహసాలు హైలెట్గా ఉన్నాయి. 642 AD కాలంలో శూలా అనే ప్రాంతంలో కథ ప్రారంభమై, భారీ యుద్ధ సన్నివేశాలు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి.

ఇప్పటివరకు భారతీయ వెండితెరపై చర్చకు రాని, చరిత్ర పుస్తకాల్లో దాగి ఉన్న ఒక యదార్థ గాథను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా కోసం గోపీచంద్ తన లుక్ మార్చడమే కాకుండా, ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకున్నారు. గోపీచంద్ మార్క్ యాక్షన్, సంకల్ప్ రెడ్డి మార్క్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సంకల్ప్ రెడ్డి: 'ఘాజీ', 'అంతరిక్షం', 'ఐబి71' వంటి చిత్రాలతో తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన సంకల్ప్ రెడ్డి, ఈసారి భారతదేశ చరిత్రలో మరుగున పడిపోయిన ఒక వీరోచిత ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. 

ఈ చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఆమె 'సత్యవతి' అనే కీలక పాత్ర పోషిస్తుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకునే రీతూ వర్మకు, 'సత్యవతి' పాత్ర కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.