దళితబంధులో అవకతవకలపై ఏసీబీ, ఈడీ, డీజీపీకి బీజేపీ లేఖలు

దళితబంధులో అవకతవకలపై ఏసీబీ, ఈడీ, డీజీపీకి బీజేపీ లేఖలు

దళితబంధులో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏసీబీ, ఈడీ, డీజీపీకి లేఖ రాసింది బీజేపీ. దళితబంధు అమలులో ఒక్కో ఎమ్మెల్యే రూ. 3 లక్షలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీలో కూడా సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు.  అన్ని  దిన  పత్రికల్లో ఇదే వార్త హైలెట్ గా వచ్చిందని..  సీఎం కేసీఆర్ కూడా దళితంబందు అవకతవకలను అంగీకరించారని పేర్కొన్నారు. దళితబంధు అవకతవకలపై  సమగ్ర దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.

మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. ఇదే లాస్ట్ వార్నింగ్

ఏప్రిల్ 27న జరిగిన  బీఆర్ఎస్ ప్లీనరీలో దళితబంధుపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు పేరుతో రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారని, ఆ చిట్టా మొత్తం తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే రిపీట్ అయితే పార్టీ టిక్కెట్ కాదు, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ ఇదే తన చివరి వార్నింగ్ అంటూ సీఎం సంచలన కామెంట్స్ చేశారు. 

ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండొద్దని, ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువే ఉందన్న ఆయన.. టికెట్ల పంచాయితీపైనా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 100సీట్లు లక్ష్యంగా నేతలంతా పని చేయాలని, టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని చెప్పారు.