నాయకత్వం ఒక ఆర్ట్..అది అందరికీ సాధ్యం కాదు 

 నాయకత్వం ఒక ఆర్ట్..అది అందరికీ సాధ్యం కాదు 

తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నియంతృత్వ పోకడలు తప్ప.. ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదన్నారు. సీఎం కేసీఆర్ తానే రాజుగా ..చక్రవర్తిగా అనుకుంటున్నారని..తాను ఏం చేసినా చెల్లుంతుందనే భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కావాలనే బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు. గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో కూడా బీజేపీ సర్పంచ్ లు ఉండాలని సూచించారు. ఎన్నో ఒడుదొడుకులు, కష్టాలు ఎదుర్కొంటేనే రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు వాళ్లకు కార్యకర్తలు లేరు. కానీ అధికారంలోకి వచ్చారు. మనకు కేంద్ర ప్రభుత్వం అండ ఉందని..ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పెంచిన ఛార్జీల వల్ల 20 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తోందన్నారు. మద్యం ధరలు పెంపుతో రాష్ట్రానికి 40 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఏ సమయంలోనైనా మద్యం సీసా దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో 6.80 లక్షల మంది ప్రజలు తాగుడుకు బానిసయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యంపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ.  7 వేల కోట్లైతే... రాష్ట్రం ఇచ్చేది రూ. 2 వేల కోట్లు మాత్రమే అన్నారు.  భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఎవరైనా పాలన చేయాలి.. అది కేసీఆర్ కు మినహాయింపు కాదన్నారు. కేసీఆర్ చేతగాని తనంతో తన తప్పుల్ని బీజేపీపై నెట్టాలని చూస్తున్నారన్నారు. బీజేపీలోకి కూడా ఇతర పార్టీల నుంచి అనేక మంది వచ్చే అవకాశం ఉందని... అంందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది

స్వతంత్య్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్