స్వతంత్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్

స్వతంత్ర వీర్ సావర్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్

భారతదేశంలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఫ్రీడమ్ ఫైటర్స్, ఫేమస్ పొలిటికల్ లీడర్స్, హీరోలు, స్పోర్ట్స్ పర్సన్ల ..పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ను వెండి తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి కనభరుస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్..ఏ వుడ్ అన్నది తేడా లేకుండా..అన్ని భాషల డైరెక్టర్లు..దేశంలో వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల  జీవితాలను సినిమాలుగా రూపొందిస్తున్నారు. తాజాగా మరో స్వాతంత్య్ర సమరయోధుడి జీవితం బయోపిక్గా రాబోతుంది. దేశం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం సినిమాగా తెరకెక్కబోతుంది. 

సావర్కర్ 139వ జయంతి సందర్భంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’టైటిల్‌తో పాటు..ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. వీర్ సావర్కర్ పాత్రలో రణ్‌దీప్ హుడా నటిస్తున్నారు.  వీర్ సావర్కర్ కారెక్టర్లో రణ్దీప్  పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంది అతని లుక్. ఈ పోస్టర్‌లో హిందుత్వ్ ధర్మ్ నహీ.. ఇతిహాస్ హై..అంటూ రాశారు. 

ఈ చిత్రాన్ని మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేయనున్నారు. ఆనంద్ పండిత్, సందీప్ సింగ్, సామ్ ఖాన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని తెరకెక్కించే ఆలోచనల్లో ఉన్నారు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్. వీర్ సావర్కర్ చిత్రాన్ని ఆయన గడిపిన ప్రదేశాల్లోనే చిత్రీకరించనున్నారు. లండన్, అండమాన్, మహారాష్ట్రలో  మూవీ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.