ఫిబ్రవరి 6న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యటన : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి

ఫిబ్రవరి 6న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యటన  : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్​జిల్లాలో ఈ నెల 6న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యటించనున్నారని  కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తెలిపారు. మంగళవారం నగర శివారులోని బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డుకు సమీపంలో ఉన్న  సభా ప్రాంగణాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. హెలిప్యాడ్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేయాలని, సభావేదిక నిర్మించాలని, వాహనాల పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ డైవర్షన్‌‌‌‌‌‌‌‌కు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, అదనపు డీసీపీ బస్వరెడ్డి, డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో సాయగౌడ్‌‌‌‌‌‌‌‌, నగర పాలక కమిషనర్‌‌‌‌‌‌‌‌ దిలీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. 

50 వేల మందితో సభ : రూరల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే 

నగర శివారులోని కేశాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామంలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సభకు సుమారు 50 వేల మంది హాజరవుతారని రూరల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌‌‌‌‌ భూపతిరెడ్డి తెలిపారు. మంగళవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్నారని, జిల్లాకు వరాల జల్లలు కురిపించే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు.