టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పళ్లిచట్టంబి’. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చీరకట్టులో చిరునవ్వుతో ఉన్న తన లుక్ ఇంప్రెస్ చేస్తోంది. యాభై, అరవై దశకాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నాడు.
నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక విశ్వక్ సేన్‌కు జంటగా కయాదు నటించిన ‘ఫంకీ’ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే నాని సినిమా ‘ది ప్యారడైజ్’లోనూ ఆమె నటిస్తోంది.
