తెరపైకి మైఖైల్‌‌ మ్యాజిక్.. మైఖేల్ ట్రైలర్ విడుదల 

తెరపైకి మైఖైల్‌‌ మ్యాజిక్.. మైఖేల్ ట్రైలర్ విడుదల 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న  ‘కింగ్‌‌ ఆఫ్ పాప్’ మైఖేల్‌‌ జాక్సన్‌‌.  ఇప్పుడు ఆయన లైఫ్‌‌ స్టోరీ ఆధారంగా ‘మైఖేల్‌‌’ అనే సినిమా వస్తోంది. మైఖైల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషిస్తున్నాడు. అంటోయిన్ ఫుక్వా దర్శకుడు. లయన్స్‌‌ గేట్‌‌, జీకే ఫిల్మ్స్‌‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

తాజాగా ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. ఒక సాదారణ పిల్లవాడి నుంచి ప్రపంచం మెచ్చిన మ్యూజిక్ ఐకాన్‌‌గా ఎలా ఎదిగాడు అనేది ఇందులో మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌. చిన్నప్పటి నుంచి తనకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, తన సోదరులతో కలిసి ‘జాక్సన్‌‌ 5’ బ్యాండ్‌‌లో భాగమవడం, తండ్రి నుంచి అలవడిన క్రమశిక్షణ, పాటల కోసం పడ్డ తపన లాంటివన్నీ ట్రైలర్‌‌‌‌లో చూపించారు. 

అలాగే గ్లోబల్‌‌ ఐకాన్‌‌గా ఎదిగే క్రమంలో ఆయన చేసిన అద్భుత ప్రదర్శనలు, అబ్బురపరిచే డాన్స్‌‌ సీక్వెన్స్‌‌లు లాంటివన్నీ ఇందులో రీ క్రియేట్‌‌ చేసినట్టు అర్థమవుతోంది.  ఆయన మేనల్లుడు జాఫర్‌‌‌‌ కేవలం మేకప్‌‌తోనే కాకుండా ఎక్స్‌‌ప్రెషన్స్‌‌, సిగ్నేచర్‌‌‌‌ మూమెంట్స్‌‌తో జాక్సన్‌‌ను గుర్తుచేశారు. ఇక జాక్సన్‌‌ జీవితంలో సంగీతమే కాదు.. వివాదాలు, విమర్శలు, వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉన్నాయి. 

ఆ సమయంలో విమర్శలను ఎలా ఎదుర్కొన్నారు,  మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించారు లాంటి అంశాలను ఇందులో టచ్ చేసినట్టు తెలుస్తోంది.  ప్రపంచానికి తెలియని మైఖైల్‌‌ గురించిన రహస్యాలు ఇందులో చూపించే అవకాశాలు ఉన్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్ 24న సినిమా విడుదల కానుంది.