
- మిగతా కులాల వారి సంఖ్య ఎలా పెరిగింది
హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే రిపోర్టులో బీసీలు, ఎస్సీల సంఖ్యను ఎందుకు తగ్గించి చూపించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి లబ్ధి కోసం బీసీల సంఖ్యను తగ్గించి చూపించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అలాగే, మిగతా సామాజిక వర్గాల సంఖ్య ఎలా పెరిగిందో కూడా చెప్పాలన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ వేదికగా బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని విమర్శలు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు.