బీహార్ అధికారులకే మంచి పోస్టింగులా?: రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

బీహార్ అధికారులకే మంచి పోస్టింగులా?: రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు
  • ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు చూస్తుంటే కేసీఆర్ బీహార్ వ్యక్తేమో అనిపిస్తున్నది 
  • ఉద్యమ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీ వాళ్లు ఇదే విషయం చెబితే మేం కాదన్నం
  • అక్బరుద్దీన్ 50 సీట్లు కాదు 119 సీట్లలో పోటీ చేయాలె

హైదరాబాద్, వెలుగు: ఇటీవల జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో తెలంగాణ ఆఫీసర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. గట్టిగా మాట్లాడే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించేందుకు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి మంచి పోస్ట్ ఇచ్చారన్నారు. 93 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తే, తెలంగాణ వాళ్లకు అప్రాధాన్య పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇచ్చి, బీహార్ అధికారులకు మాత్రమే ప్రాధాన్య పోస్టులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఈ బదిలీలు చూస్తుంటే కేసీఆర్ బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తేమో అన్న అనుమానం వస్తున్నదన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది బీహార్ అని ఏపీ లీడర్లు అంటే.. కాదని తాము వాదించామని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు తమకు ఆ అనుమానం వస్తున్నదని చెప్పారు. ఆదివారం పార్టీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో రఘనందన్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్ ఆఫీసర్ అని, ఆయనది కూడా బీహార్ అని గుర్తుచేశారు. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంజయ్ కుమార్ జైన్, ఐజీ హైదరాబాద్ పోస్టింగ్ వచ్చిన షానవాజ్ ఖాసీం, ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీ స్వాతీ లక్రా వీరంతా బీహార్ వాళ్లేనన్నారు. ఉద్యమంలో జై తెలంగాణ అన్న వారిని రబ్బర్ బుల్లెట్లతో కాల్చిన వ్యక్తి, ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ ఐజీ, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు అడిషనల్ చార్జ్ ఇచ్చారన్నారు. ఈయనది ఏపీ అని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన పోలీసులంతా కేసీఆర్ ఏం చేస్తున్నారో ఆలోచించాలన్నారు. 

ఉద్యమకారులను ఎందుకు ఆదుకోలే..

జల దృశ్యంలో కేటీఆర్ లేడని, ఆ సమయంలో ఆయన అమెరికాలో ఉద్యోగం చేసేవాడని రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. పోలీసు కిష్టయ్య ముదిరాజ్, డీఎస్పీ నళినిలు , శ్రీకాంతాచారి కుటుంబం తెలంగాణ కుటుంబం కాదా అని ప్రశ్నించారు.  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే 50 సీట్లు కాదు 119 సీట్లలో  పోటీ చేయాలన్నారు. 15 సీట్లు గెలిచి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉంటా అని చెప్పడం సిగ్గుచేటన్నారు.