న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 18.
విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్ (సి) – జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 03, నర్స్ (ఏ) 11, సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) – రేడియోగ్రాఫర్ 01, సైంటిఫిక్ అసిస్టెంట్ (బి)– పాథాలజీ టెక్నీషియన్ 01, ఫార్మాసిస్ట్ (బి) 01, టెక్నీషియన్ (బి) – ఎక్స్– రే టెక్నీషియన్ 01.
ఎలిజిబిలిటీ
సైంటిఫిక్ ఆఫీసర్ (సి) – జీడీఎంఓ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టరై ఉండాలి.
నర్స్ (ఏ): 12వ తరగతితోపాటు నర్సింగ్ & మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) లేదా సాయుధ దళాల హాస్పిటల్లో మూడేండ్ల పని అనుభవంతో నర్సింగ్ 'ఎ' సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్ (బి)– రేడియోగ్రాఫర్: కనీసం 60% మార్కులతో బీఎస్సీ (రేడియోగ్రఫీ) లేదా కనీసం 50% మార్కులతో బీఎస్సీతోపాటు రేడియోగ్రఫీలో ఏడాది డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్ (బి) పాథాలజీ టెక్నీషియన్: కనీసం 60% మార్కులతో బీఎస్సీతోపాటు డి.ఎం.ఎల్.టి.లో పి.జి. డిప్లొమా లేదా కనీసం 60% మార్కులతో బీఎస్సీ (ఎం.ఎల్.టి.) పూర్తిచేసి ఉండాలి.
►ALSO READ | BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. బీటెక్, సీఏ పూర్తి చేసిన వారికి సువర్ణావకాశం!
ఫార్మాసిస్ట్ (బి): ఇంటర్మీడియట్‌తోపాటు ఫార్మసీలో రెండేండ్ల డిప్లొమా కలిగి ఉండాలి.
టెక్నీషియన్ (బి) – ఎక్స్–రే టెక్నీషియన్: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌తోపాటు మెడికల్ రేడియోగ్రఫీ/ ఎక్స్–రే టెక్నీషియన్ ట్రేడులో ఏడాది సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 21.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు స్క్రీనింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిగిలిన పోస్టులకు ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ recruit.nfc.gov.in ను సందర్శించండి.
