సీసీటీవీ పుటేజీపై క్లారిటీ కావాలె..

సీసీటీవీ పుటేజీపై క్లారిటీ కావాలె..
  • నిందితులను 24 గంటలలోపు అరెస్ట్ చెయ్యాలె
  • సీసీటీవీ పుటేజీపై క్లారిటీ కావాలె..

హైదరాబాద్:  ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే.. ఈ రాష్ట్ర సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. శుక్రవారం ఆయన బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రామరాజ్యంగా పాలన జరుగుతుంటే .. తెలంగాణలో దృతరాష్ట్ర పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న సీసీటీవీలు ఏ రాష్ట్రంలో లేవని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారన్నారు కానీ.. మహిళపై జరిగిన దారుణ ఘటనపై ఎలాంటి సీసీటీవీ పుటేజీ లేదనడం సిగ్గుచేటు అన్నారు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మైనర్ రేప్ కేసులో ఘటనలో ఎంఐఎం లీడర్ల కొడుకులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బాధితురాలి తరఫున పోరాడుతామని.. అసలు నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే వీఐపీ కల్చర్ ను ప్రమోట్ చేసినట్లు అవుతుందన్నారు.  బహదూర్ పురా ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా దానిపై కూడా ఏం మాట్లడటంలేదని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కేసుకు సంబంధించి మరొకరి కోసం వెదుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారని.. అయితే మైనర్ బాలికను బెంజ్ లో ఎవరు తీసుకెళ్లారు ? ఆ టైంలో కారులో ఎవరెవరు ఉన్నారు ? చివరగా ఆమెను ఇన్నోవాలో డ్రాప్ చేసిందెవరు అనే అనుమానాలు ఉన్నాయన్నారు.

అయితే ఈనెల 28న బాలిక తండ్రి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు 31న FIR చెయ్యడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని.. ఇప్పటికే ఈ కేసును కొంతమంది లీడర్లు ఇన్ ఫ్లూయన్స్ చేస్తున్నట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయని చెప్పారు. రూ. 12 వందల కోట్లతో పెట్టిన సీసీటీవీలు పని చేయలేదని డీజీపీ మహేదర్ రెడ్డి చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ నెంబర్ 1 అని చెప్పే సీఎం కేసీఆర్ ఒక ఆడబిడ్డను రక్షించలేక పోతున్నారని చెప్పారు. మీ సీసీటీవీలు ఎందుకు పనిచేయడంలేదో పోలీసులు చెప్పాలని.. కారు నెంబర్ ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడంలేదన్నారు. పోలీసులు అనుకుంటున్నట్లున్నారు మేం సీసీటీవీ పుటేజీని తీసేశాం కదా.. బీజేపీ వాళ్లకు ఈ నిజాలు ఎలా తెలుస్తున్నాయా అనుకుంటున్నారు.. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. పోలీసులు మౌనమే పాటిస్తున్నారని.. కనీసం సమాయానికి FIR నమోదు చేయడంలేదన్నారు. మైనర్ బాలికకు సంబంధించిన పూర్తి సీసీటీవీ పుటేజీ సీజ్ అయ్యిందా కాలేదా అనేదానిపై క్లారిటీ కావాలని డిమాండ్ చేశారు.

మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ బాలిక ఫ్యామిలీని బెదిరిస్తున్నారని..డోర్ లాక్ చేసి వారిని బయటకు పంపిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కడా సీసీటీవీ పుటేజీని ఎడిట్ చేసినట్లు తెలిసినా ..బీజేపీ ఊరుకోదన్నారు. 28న ఘటన జరిగితే 31 FIR రిజిస్టర్ కాగా.. జూన్ 02న బయటకి వచ్చిందన్నారు. ఓ మైనర్ బాలిక పై రేప్ జరిగితే సాక్షత్తు ముఖ్యమంత్రి మాట్లడరు.. ట్విట్టర్ పక్షి కూయదు.. మహిళ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడదన్నారు. నిందితులను 24 గంటలలోపు అరెస్ట్ చేయకపోతే బీజేపీ న్యాయపోరాటం చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.