రెండో వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తా

రెండో వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తా

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్  అప్ లోడ్ చేసిన వివాదాస్పద వీడియోపై ముస్లింలు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసి ఆయన ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని.. తిట్టే వారికే విలువ ఉందన్నారు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్ ఫారూఖికి ఇచ్చి..షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా ,రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు  పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. 

అయితే తాను  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని   రాజా సింగ్ వెల్లడించారు. రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని‌ హెచ్చరించినా షో ప్రదర్శించారని అన్నారు. దండం పెట్టి వేడుకున్నా పోలీసులు వినలేదన్నారు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని కేటీఆర్ ను ప్రశ్నించారు. మునావర్ ఫారూఖికి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పానన్నారు. రెండో భాగానికి సంబంధించిన వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాననని వెల్లడించారు. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. తనపై ఎలాంటి చర్యలకు దిగిన తాను రెడీ అని రాజాసింగ్  చెప్పారు.