గోవులతో క్యాంపు ఆఫీసు ముట్టడిస్తం

గోవులతో క్యాంపు ఆఫీసు ముట్టడిస్తం

వచ్చే నెలలో జరిగే బక్రీద్ కోసం.. ముందస్తుగా గోవులను లారీల్లో హైదరాబాద్‌కి తరలిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గోవుల అక్రమ తరలింపు జోరుగా సాగుతుందని ఆయన అన్నారు. బీబీనగర్ పీఎస్ లిమిట్స్‌లో లారీలో ఆవులను తరలిస్తుండగా గోరక్ష కార్యకర్తలు పట్టుకున్నారు. బక్రీద్ సందర్భంగా గోవుల అక్రమ తరలింపు ఎక్కువైందని ఆయన అన్నారు. ఇప్పటికే రెండు లారీలు పట్టుకుని పోలీసులకు అప్పగించామని రాజాసింగ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హైవేలపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని డీజీపీ మరియు కమిషనర్లను కోరారు. పోలీసులు అలర్ట్‌గా ఉండి.. గోవుల దిగుమతిని అడ్డుకోకపోతే.. తాము పట్టుకున్న వాహనాలతో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.