
నిజాం రాజ్యం ఎలా ఉండేదో టీఆర్ఎస్ మరచి పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చార్మినార్ పేరు చెబితే నిజాం పేరు చెప్తారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నాడని..నిజాం పాలన తరహాలో కేసీఆర్ పాలిస్తున్నారు అనడానికి మంత్రి కామెంట్ లు నిదర్శనం అన్నారు. శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చూస్తే అదే నిజమనిపిస్తుందని చెప్పారు రాజాసింగ్. మీ హామీలేమయ్యాయి.. నీళ్లు, నిధులు నియామకాలు ఏమయ్యాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైంది. పట్టించుకున్నరా. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గొప్పలకు పోవడం మంచిది కాదని తెలిపారు. కమీషన్ ఇవ్వండి .. ఫైల్లు తీసుకోండి అన్నట్టు పాలన సాగుతోందన్నారు.
మీరు చేసిన అప్పులు ఎంతో ప్రజలకు చెప్పండి. బీజేపీ సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకుంటది. కొత్త సచివాలయం పేరుతో ఖర్చు చేసే కోట్ల రూపాయలు ఇల్లులేని వారికి ఇల్లు కట్టించండని తెలిపారు. నిజాంను ప్రజలు ఎలా తరిమికొట్టారో.. మీ పార్టీని, కూడా బీజేపీ తరిమి తరిమి కొడుతదన్నారు. మీరు చేసే తప్పుడు పనులను బీజేపీ అడ్డుకుంటదన్నారుజ నిజాం తరహాలో కట్టడాల విషయంలో తన పెరు కూడా ఆలా చెప్పుకోవాలన్న గొప్పలకు కేసీఆర్ పోతున్నారని తెలిపారు రాజాసింగ్.