రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కార్యదర్శిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కార్యదర్శిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: రాజ్భవన్లో గవర్నర్ కార్యదర్శిని కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు. అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ లేకపోవడంతో గవర్నర్ కార్యదర్శికి తమ అభ్యంతరాలతో ఫిర్యాదు చేశారు. అక్బరుద్దీన్ కంటే చాలా మంది సీనియర్లు ఉన్నారని .. సీనియర్లను కాకుండా అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ నియమంచడంపై తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ ఎమ్మెల్యేలు. 


ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఉండటంతో ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా నియమించడంతో ఎంఐఎం, కాంగ్రెస్ బంధం మరోసారి రుజువైందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు.