ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కూల్చి పేదలకు పంచుతాం

V6 Velugu Posted on Jul 30, 2021

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు దళితులు, గిరిజనులపై చిత్తశుద్ధి లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్.. ఒక్కో దళితుడికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 శాతం దళితుల్లో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రిగా చేసే అర్హత లేదా అని ప్రశ్నించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్.. గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 

‘సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్.. గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నడు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్. ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నడు. పోడు భూముల సమస్యలపై పోరాటం చేస్తాం. ప్రగతి భవన్‌‌, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతాం. ప్రగతి భవన్ ప్లేస్‌‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాం. రాష్ట్రంలో బీజేపీ గెలిచాక తొలి సంతకం ఈ ఫైల్ పైనే పెడతాం. కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తం. హుజూరాబాద్‌‌లో మా పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. కేసీఆర్‌‌పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయింది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Tagged CM KCR, Pragati Bhavan, BJP MP Bandi Sanjay, Ambedkar Statue, Dalit bandhu, KCR Form House

Latest Videos

Subscribe Now

More News