
లోక్ సభ ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా. ఇందులో 184 మంది పేర్లను ప్రకటించారు. ప్రధాని మోడి వారణాసి నుంచి పోటీ చేస్తుండగా.. అమిత్ షా గాంధీ నగర్ నుండి బరిలో దిగుతున్నారు. ఇది వరకు గాంధీ నగర్ నుండి బీజేపీ సీనియర్ నాయకుడు అడ్వాని పోటీ చేశారు. అయితే ఈ సారి మాత్రం ఆయన పోటీలో నిలవడానికి సుముకత వ్యక్తం చేయలేదు.
తెలంగాణ నుండి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయనున్న పది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ చీఫ్ కిషన్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వగా.. బండారు దత్తాత్రేయకు స్థానం లభించలేదు.
మల్కాజ్‌గిరి – రామచంద్రరావు
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
మహబూబ్‌నగర్ – డీకే అరుణ
నాగర్‌కర్నూలు – బంగారు శ్రుతి
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – డి. అరవింద్
నల్గొండ – గార్లపాటి జితేంద్రకుమార్
భువనగిరి – పీవీ శ్యామ్‌సుందర్ రావు
వరంగల్ – చింతా సాంబమూర్తి
మహబూబాబాద్ – హుస్సేన్‌నాయక్
ఆంధ్ర ప్రదేశ్ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయనున్న ఇద్దరి పేర్లను ప్రకటించారు.
విశాఖ – పురందేశ్వరి
నరసరావుపేట – కన్నా లక్ష్మీనారాయణ