
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం హిందూస్థాన్‌లో ఉందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదేదో పాకిస్థాన్‌లో ఉందన్నట్లుగా వ్యవహారిస్తున్నారన్నారు బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సోమవారం తెలంగాణ అసెంబ్లీ సీఏఏ వ్యతిరేక తీర్మానం ఆమోదించడంపై ఎంపీ మాట్లాడుతూ.. NRC CAA వల్ల భారత ముస్లిం సోదరులకు ఎలాంటి నష్టం లేదన్నారు. ముఖ్యమంత్రి ఎజెండా చెత్త ఎజెండా అంటూ… ఆయన చేసిన తీర్మానాన్ని చెత్త బుట్టలో వేసుకోమన్నారు. బర్త్ సర్టిఫికెట్ లేదంటున్న ముఖ్యమంత్రి యొక్క సర్టిఫికెట్ AP లోని విజయనగరంలో ఉందని, అక్కడికి వెళ్లి మండల ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకోమని అన్నారు. అసలు సిసలైన భరతమాత ముద్దు బిడ్డ రాజసింగ్ అని, ఆయనపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు చెప్పారు.