Arvind : ముందస్తుకు పోతే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఔట్

Arvind : ముందస్తుకు పోతే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఔట్

ఇందూర్ ప్రజలను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదు కాని తిలక్ గార్డెన్ గుర్తుకు వచ్చి నిధులు కేటాయించారని విమర్శించారు. 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముందస్తుకు పోతే.. సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోతారని అర్వింద్ చెప్పారు. ఇందూరు సభలో కేటీఆర్ రిజైన్ చేస్తాననగానే అక్కడున్న వాళ్లు చప్పట్లు కొట్టిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప వీళ్లు చేసిందేమి లేదని కేసీఆర్, కేటీఆర్ పై అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పైస్ బోర్డు ద్వారా రూ.30 కోట్లు అదనంగా తీసుకువచ్చామని చెబుతున్నారు గానీ.. ఆ నిధులతో పసుపు పంటకు గాని.. చెరుకు పంటకు ఏమీ చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సామాన్యుల పరిస్థితి మరింత దిగజారిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.