ఎగ్జిట్ పోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మం..కర్నాటకలో బీజేపీదే గెలుపు : ఎంపీ లక్ష్మణ్

ఎగ్జిట్ పోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మం..కర్నాటకలో బీజేపీదే గెలుపు : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్,వెలుగు : ఎగ్జిట్ పోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నమ్మడం లేదని, పీపుల్స్ పోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే నమ్ముతామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వాన్నే కర్నాటక ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో పాలన పడకేసిందని, సీఎం కేసీఆర్ ఫక్తు రాజకీయాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. వాళ్ల హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 5 వేలకు పైగా వీఆర్వోలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారని, ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం మోపారని గుర్తుచేశారు.

అకాల వర్షాలతో రైతులు నష్టపోతే, దీనిపై సమీక్ష చేసే తీరిక సీఎంకు లేకపోవడం రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతున్నదన్నారు. రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే ప్రచారం కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. రైతుల కోసం రూ.300 కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనకాడుతుండటం దురదృష్టకరమన్నారు.