
వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. పరిస్థితులు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా అన్న భావన కలుగుతోందన్నారు. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు సుజనా. తన పార్టీ సిద్ధాంతం ఏదైనా, ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై వ్యక్తిగతంగా పోరాడుతానన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు సుజనా.